అమృత్‌సర్‌లో భారీ పేలుడు, ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
- November 18, 2018
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నిరంకారీ భవన్ వద్ద ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అమృత్‌సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. నిరంకారీ భవన్ స్థానిక ఆధ్యాత్మిక మందిరం. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకి చేరుకున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







