డోనాల్డ్ ట్రంప్‌ రహస్య పర్యటన

- January 04, 2019 , by Maagulf
డోనాల్డ్ ట్రంప్‌ రహస్య పర్యటన

టెహ్రాన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాగ్దాద్‌లో ఇటీవల జరిపిన రహస్య పర్యటన ఇరాక్‌లో అమెరికా ఓటమికి ఒక తిరు గులేని తార్కాణమని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ బుధవారం వ్యాఖ్యా నించారు. ఇరాక్‌పై దురాక్రమణకు యత్నించిన అమెరికా దారుణంగా భంగపడిందని ఆయన చెప్పారు. మంత్రి వర్గ సమావేశంలో సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌ల నుంచి అమెరికా సేనల ఉపసంహ రణ గురించి ట్రంప్‌ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ అత్యంత రహస్యంగా బాగ్దాద్‌కు రావడం, వచ్చాక కూడా సైనిక స్థావరాన్ని దాటి ఒక్క అడుగు కూడా బయటకు వెళ్లకపోవడం ఇవన్నీ ఇరాక్‌లో అమె రికా ఓటమిని తెలియజేస్తున్నా యని రౌహాని చెప్పారు. ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా విజ యం సాధించలేదు. అమెరికా గురించి ఇరాక్‌ ప్రజలకు బాగా తెలుసు, అగ్ర రాజ్యాన్ని వారు ఎంతమాత్రమూ విశ్వసించడం లేదు. అమెరికా తీరుపై ఎంత మాత్రమూ సంతృప్తికరంగా లేరు. అమెరికా సేనలపై వారు తిరగబడుతున్నారని రౌహాని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com