మోడీ బయోపిక్ కి టైటిల్ ఖరారు
- January 04, 2019బాలీవుడ్లో బయోపిక్ ల జోరు మరింత ఊపందుకుంటోంది. ఇప్పటికే కొన్ని బయోపిక్ లు సెట్స్ పై ఉండగా, మరికొన్ని బయోపికలు సెట్స్ పైకి వెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. నరేంద్ర మోడీ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి 'పీఎమ్ నరేంద్ర మోడీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సందీప్ సింగ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలనున్నారు. ఈ నెల 2వ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఒక సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ, అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి రావడం వెనుక ఆయన కృషి .. పట్టుదల .. లక్ష్య సాధన ఎంతో వున్నాయి. వాటన్నింటినీ ఈ బయోపిక్ లో చూపించనున్నారట.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?