డ్రగ్స్‌తో ఇద్దరి అరెస్ట్
- January 08, 2019కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 వద్ద ఇద్దరు ప్రయాణీకుల నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీరిద్దరూ కైరో నుంచి వచ్చినట్లు కస్టమ్స్ మీడియా కమిటీ మెంబర్ నవాఫ్ అల్ మటార్ చెప్పారు. కస్టమ్ అధికారులు, టీ4 టెర్మినల్ వద్ద అనుమానాస్పదంగా వున్న ఓ వ్యక్తిని ఆపి సోదాలు నిర్వహించగా ఆ వ్యక్తి నుంచి హాషిస్, నార్కోటిక్స్ కలిగిన ఆరు పిల్స్ లభించాయి. వ్యక్తిగత అవసరాల కోసం వాటిని తమవెంట తెచ్చుకున్నట్లు నిందితుడు తెలిపాడు. మరో కేసులో, అదే రోజు కైరో నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 160 నార్కోటిక్ పిల్స్, 7 పిల్స్ హాషిస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన అధికారులు, తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్