తేజ సినిమాలో హీరో విశాల్..
- January 30, 2019దర్శకుడు తేజ, తమిళ హీరో విశాల్ కలిసి సినిమా చేయనున్నారు. తెలుగువాడైన విశాల్ తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులో అనువాదం అవుతూ విజయం సాధిస్తున్నాయి. పలు సందర్భాల్లో తెలుగులో సినిమా చేస్తాను అని విశాల్ చెప్పేవారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరిందని తెలిసింది. తేజ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 'నేనే రాజు నేనే మంత్రి' విజయంతో తేజ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకముందే తప్పుకున్నారు. ఆ తర్వాత బెల్లంకొడ సాయి శ్రీనివాస్, కాజల్ నటిస్తున్న సీత చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తిచేశాక విశాల్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. విశాల్ కూడా తమిళంలో బిజీగా ఉన్నారు. 'టెంపర్' రీమేక్ 'ఆయోగ్య'లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్‌లో వీరి సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..