వైఎస్ఆర్లా చేయడం కష్టం అనిపించింది - మమ్మూట్టి
- February 03, 2019ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలోని ప్రముఖ ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యాత్ర'. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రను మాళయాళ సూపర్‌స్టార్ మమ్మూట్టి నటించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జోరును పెంచేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మమ్మూట్టి పాల్గొన్నారు. సినిమా విశేషాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు మమ్మూట్టి.
సినిమా కథ వినగానే ఇది నేను చేయాల్సిన సినిమా అని మెంటల్ ఫిక్స్ అయానని తెలిపాడు. అంతకు ముందు వైఎస్ఆర్ గురించి నాకు తెలియదని ,సినిమా చేసే సమయంలోనే ఆయన గొప్పతనం తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆయన పాదయాత్ర చూసి ,అచ్చం ఆయనలా చేయడానికి ప్రయత్నించానని చూసి ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలని కోరాడు మమ్మూట్టి. వైఎస్ఆర్లా చేతులు ఊపడం కష్టంగా అనిపించిందని ఆయన పెర్కొన్నారు. ఇక ఈ సినిమాను తెలుగు,మళయాళ భాషలలో ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. జగపతి బాబు,అనసూయలు సినిమాలోని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..