మనోడికి నలుగురు హీరోయిన్లు
- February 03, 2019
విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసింది. క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ నంబర్ 46 రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కేథరిన్ థెరిసాను హీరోయిన్‌గా చిత్రబృందం ఎంపిక చేసింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లె ఇప్పటికే హీరోయిన్లుగా నటిస్తుండగా.. 4వ హీరోయిన్‌గా కాథెరిన్ థెరిసాను చిత్రబృందం ఎంపిక చేసింది. ఇప్పటికే ఆమె కూడా షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







