అమెరికాలో విద్యార్థుల రిలీజ్ పై ఉత్కంఠ

- February 03, 2019 , by Maagulf
అమెరికాలో విద్యార్థుల రిలీజ్ పై ఉత్కంఠ

అమెరికా వేసిన వలలో భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. కాని అగ్రరాజ్యం ఈ విధంగా చేయడంపైనా, మన విద్యార్థుల అరెస్ట్ వ్యవహారంపైనా.. మన విదేశాంగ శాఖ డెమోర్ష్.. అంటే అభ్యంతర పత్రాన్ని జారీ చేసింది. విద్యార్థులను బాగోగులపై ఆందోళన వ్యక్తం చేసింది. వారి కలవడానికి వీలుగా దౌత్య అధికారులను అనుమతించాలని కోరింది. అమెరికా ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న 130 మంది విద్యార్థుల్లో ఒక్కరు తప్ప.. మిగిలినవారంతా భారతీయులే. అరెస్ట్ అయిన వారిలో 8 మంది దళారులు కూడా ఉన్నారు. అమెరికా ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నవారిలో 30 మందిని మన దౌత్య అధికారులు కలవగలిగారు. వేరు వేరు నిర్బంధ కేంద్రాల్లో ఉన్న మిగిలినవారినీ కలవనున్నారు. అరెస్టయిన విద్యార్థుల క్షేమ సమాచారంతో పాటు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా నివృత్తి చేయడానికి వీలుగా వాషింగ్టన్ లోని మన రాయబార కార్యాలయంలో ఓ సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. విద్యార్థుల క్షేమ సమాచారాన్ని మన అధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో వివిధ అంశాలపై సమన్వయం కోసం మన రాయబార కార్యాలయం ఓ నోడల్ అధికారిని కూడా నియమించింది.

ఫర్మింగన్ టౌన్ యూనివర్సిటీ వ్యవహారంలో ఆటా-తెలంగాణ ముందడుగు వేసింది. అమెరికా భద్రతా అధికారుల నిర్బంధంలో ఉన్న 8 మంది విద్యార్థులను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు కలుసుకున్నారు. దీనికోసం ఇద్దరు టాప్ అటార్నీల సేవలను కూడా ఉపయోగించుకుంది ఆటా-తెలంగాణ. విద్యార్థులకు అవసరమైన సాయం చేయడానికి ఆటా-తెలంగాణ చొరవ చూపిస్తోంది. విద్యార్థులతో అటార్నీలను మాట్లాడించి విషయం తెలుసుకోవడానికి ఆటా-తెలంగాణ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. వీలైనంతవరకు నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ కలుసుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరుతోంది. ఆటా ప్రతినిధులు.. స్టూడెంట్ రిక్రూటర్స్ పేర్లను కూడా సేకరించారు. వారి పేర్లు.. క్రాంతి కిరణ్ తడకపల్లి, చంద్రశేఖర్ రెడ్డి వేమిరెడ్డి, కృష్ణ చైతన్య రెడ్డి యల్లంకి, భరత్ యడవల్లి రెడ్డి, సంచనకోట సిద్దార్థ్, శశాంక్ పర్సి, శేఖర్ బాబు తోట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com