అనారోగ్యంతో ఆస్నత్రిలో చేరిన సోను నిగమ్
- February 07, 2019ఆరోగ్యమే మహాభాగ్యమని తెలిసొచ్చిందని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్. దేనితో పెట్టుకున్నా.. ఎలర్జీతో మాత్రం పెట్టుకోవద్దని చెబుతున్నారు. మీ హెల్త్ కు పడని వస్తువులు తిని… నాలా బాధపడొద్దని సూచిస్తున్నాడు. ఒరిస్సాలో ఓ ప్రోగ్రామ్ చేసేందుకు వెళ్లిన సోను నిగమ్… సీ ఫుడ్ చూసి టెంప్ట్ అయ్యాడట. సీ ఫుడ్ అలర్జీ ఉందని తెలిసినా… టేస్టీగా ఉండడంతో ఫుల్ గా తినేశాడట. దీంతో వెంటనే అలర్జీ అందుకుంది. కళ్లు, ముక్కు స్వెలింగ్ వచ్చింది. అది కాస్త శృతి మించడంతో… ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చేరాడు సోను. కొద్దిగా ఆలస్యం అయితే శ్వాసనాళానికి స్వెలింగ్ వచ్చి… శ్వాస తీసుకోవడం కష్టంగా మారి చాలా ఇబ్బంది తలెత్తేదని చెప్పాడు. థ్యాంక్ గాడ్.. మీ ప్రేమ, ఆశీర్వాదాల వల్ల ప్రస్తుతం బాగానే ఉన్నానన్న సోనూ నిగమ్… మీరు ఇలాంటి ఛాన్స్ తీసుకోవద్దన్నారు. హ్యాపీ హెల్దీ లైఫ్ టు ఎవిరీ వన్ అని విష్ చేశాడు. దీనిపై స్పందించిన ఫ్యాన్స్… సోనూ నిన్ను ఇలా చూడడం చాలా బాధగా ఉంది… గెట్ వెల్ సూన్ అని చెబుతున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు