రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మందు ఫ్రీ..అది కూడా దుబాయ్ లో!
- February 07, 2019
అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి కానీ క్లబ్‌లు మాత్రం కొంచెం వెసులు బాటుగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల కోసం లేడీస్ క్లబ్‌లు వందల సంఖ్యలో ఉంటాయి దుబాయ్ నగరంలో. అందులో వారికి ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి.
తెల్లవారు జామున వారిని ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ పాపం పురుషులకి అన్యాయం జరిగిపోతోంది. వారికి ఆఫర్లు ఉండవు, సౌకర్యాలు ఉండవు. అందుకే ఓ రెస్టారెంట్ వారి బాధను అర్థం చేసుకుని ఓ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది.
రాత్రి పూట రెండు గంటల పాటు మగమహారాజులకి మందు ఫ్రీ అని ప్రకటించింది. అనుకున్నదే తడవుగా ఓ బోర్డుని సిద్దం చేసి క్లబ్ ముందు పెట్టేసింది. పెగ్గు ఫ్రీగా ఇస్తూ ఫుడ్డుకి మాత్రం 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దుబాయిలోని 'ఆసియా ద క్యూబా' అనే రెస్టారెంట్ ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్లపై దుబాయి నైట్ క్లబ్‌ల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది.
మరి ఈ ఆఫర్ ఫిబ్రవరి 19 నుంచి 'వెస్టిన్ దుబాయ్ మైనా సెయాహీ బీచ్ రిసార్ట్'లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ప్రతి మంగళవారం ఇక్కడ క్లబ్ నిర్వహణ జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు పురుషులకు ఉచితంగా డ్రింకులను అందుబాటులో ఉంచుతారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







