వీకెండ్ అలర్ట్: ఈ ముఖ్యమైన రోడ్ల మూసివేత
- February 22, 2019అబుదాబీ డిపార్ట్మెంట్ ఆప్ ట్రాన్స్పోర్ట్, కొన్ని ముఖ్యమైన రోడ్లకు సంబంధించి వీకెండ్లో మెయిన్టెనెన్స్ చర్యల నిమిత్తం 'క్లోజర్'ని అమలు చేస్తోంది. అబుదాబీ - అల్ అయిన్ రోడ్డు (ఇ22), ఇ11 నుంచి ఘ్వెఫాట్ వైపు రోడ్డు ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు తాత్కాలిక పాక్షిక క్లోజర్ అమల్లో వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు మ్యాప్‌ని పోస్ట్ చేసిన అధికారులు, దానికి అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. అల్ ముస్తక్బాల్ స్ట్రీట్ మరియు అల్ రయా స్ట్రీట్‌ని 12 గంటల నుంచి అర్థరాత్రి వరకు స్ట్రీట్ ఫెస్టివల్ కారణంగా మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు అల్ ముల్తుకా స్ట్రీట్‌ని ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?