మంటల్లో అక్షయ్ కుమార్
- March 06, 2019సాధారణంగా స్టార్ హీరోల సినిమా స్టంట్స్ చూస్తుంటాం. అయితే సినిమాల్లో రిస్కీ స్టంట్స్ చేసేప్పుడు వారు డూప్స్ ద్వారా షూట్ చేస్తుంటారు. కానీ రియల్‌గా ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ స్టెంట్ చేసి ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ఓ వేదికపై తన సూట్‌కి నిప్పంటించుకొని మంటల్లో కాలిపోతూ కనిపించారు అక్షయ్. తన తాజా వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ ఈ రిస్కీ స్టంట్ చేశారు.
ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. 'ది ఎండ్' అనే పేరుతో ఈ వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది. అయితే ఈ వెబ్ సీరీస్ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంటల్లో కాలిపోతూ స్టేజ్ పైకి వచ్చారు అక్షయ్. ఈ మేరకు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. ఇది కేవలం ఆరంభమే అని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్