డాన్ లుక్‌లో శర్వానంద్
- March 06, 2019
యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య శర్వానంద్‌కు కాలం కలిసి రావడం లేదు. ఇటీవలే పడి పడి లేచే మనస్సు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ సినిమా తరువాత శర్వా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రోజు శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడిగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. సినిమాను వచ్చే సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్