సల్మాన్ ఖాన్ 'భారత్' ఫస్ట్ లుక్
- April 15, 2019బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా భారత్ ఊహలకందని రీతిలో ఉండనుంది. దేశం మీద తనకున్న అభిమానాన్ని చాలా సినిమాల్లో చాటుకున్నాడు సల్మాన్. ఈ సినిమాలో కొత్త గెటప్‌తో కనిపించబోతున్నట్లు తెలిపినా.. ఫస్ట్ లుక్ విడుదల చేశాక అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. అలీ అబ్బాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్, టబూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. మరి కొద్ది రోజుల్లో టీజర్ రిలీజ్ కాబోతుండగా దాని కంటే ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ సూపర్‌గా ఉందంటూ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది.
సోమవారం భారత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసి.. దాని కింద ఓ వపర్ ఫుట్ కామెంట్ పెట్టారు. 'నా జుట్టు, గడ్డంలో ఎన్ని తెల్ల వెంటుకలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువగా నా జీవితం రంగులమయం' అంటూ సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్లో సల్లూ భాయ్.. 70 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తున్నారు.
ఈ సినిమాలో సల్మాన్ 20 ఏళ్ల వ్యక్తి గెటప్ నుంచి 70 ఏళ్ల వృద్ధుడి గెటప్ వరకు వివిధ లుక్స్‌లో కనిపించి అలరించనున్నట్లు లుక్స్ చూస్తే తెలుస్తుంది. భారత్ మూవీలో జాకీష్రాఫ్.. సల్మాన్‌కు తండ్రిగా నటించనున్నట్లు ప్రచారంలో ఉండగా ఫిమేల్ లీడ్ రోల్లో కత్రినా నటించనుంది. ఏప్రిల్ 24న సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. రంజాన్ నాటికల్లా ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..