శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా డెబ్యూ చిత్రం `ఏదైనాజ‌ర‌గొచ్చు` టీజ‌ర్‌ విడుద‌ల

- April 22, 2019 , by Maagulf
శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా డెబ్యూ చిత్రం `ఏదైనాజ‌ర‌గొచ్చు` టీజ‌ర్‌ విడుద‌ల

ప్ర‌ముఖ న‌టుడు శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న‌ చిత్రం `ఏదైనా జ‌ర‌గొచ్చు`. వెట్ బ్రెయిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సుధ‌ర్మ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.ర‌మాకాంత్ ద‌ర్శ‌కుడు. పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్స్. 

ఈ సినిమా టీజ‌ర్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``నేను అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుండి శివాజీరాజాతో  మంచి ప‌రిచ‌యం ఉంది. మంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఆయ‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు విజ‌య్ రాజా హీరోగా పరిచ‌యం అవుతున్నారు. త‌ను సినీ ప‌రిశ్ర‌మలో పెద్ద స్టార్‌గా ఎద‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో విల‌న్‌గా న‌టించిన బాబీ సింహ తమిళంలో పెద్ద న‌టుడు. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 

శివాజీ రాజా మాట్లాడుతూ - ``వినాయ‌క్‌గారి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌నకు నా స్పెష‌ల్ థాంక్స్‌. `ఏదైనా జ‌ర‌గొచ్చు` సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెడుతున్న మా అబ్బాయి విజ‌య్ రాజాను ఆశీర్వదించండి`` అన్నారు. 

ద‌ర్శ‌కుడు ర‌మాకాంత్ మాట్లాడుతూ - ``ఇదొక క్రైమ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌. మంచి టీం కుదిరింది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. మంచి స‌పోర్ట్ అందిస్తున్నారు. అలాగే మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసి, యూనిట్‌ను అభినందించిన వినాయ‌క్‌గారికి థాంక్స్‌`` అన్నారు. 


న‌టీన‌టులు:

విజ‌య్ రాజా

బాబీ సింహ‌

పూజా సోలంకి

సాషా సింగ్‌

రాఘ‌వ‌

ర‌వి శివ తేజ‌

నాగ‌బాబు

అజ‌య్ ఘోష్‌

వెన్నెల కిషోర్‌

పృథ్వి

ఝాన్సీ

వైవా హ‌ర్ష‌

తాగుబోతు ర‌మేష్‌

చ‌మ్మ‌క్ చంద్ర‌

ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌క‌త్వం:  కె.ర‌మాకాంత్‌

నిర్మాణ సంస్థ‌లు:  వెట్ బ్రెయిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, సుధ‌ర్మ్ ప్రొడ‌క్ష‌న్స్‌

స‌హ నిర్మాత‌:  సుద‌ర్శ‌న్ హ‌న‌గోడు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  విజ‌య్ ప్ర‌కాశ్ అన్నం రెడ్డి

సినిమాటోగ్ర‌ఫీ:  స‌మీర్ రెడ్డి

సంగీతం:  శ్రీకాంత్ పెండ్యాల‌

ఎడిట‌ర్‌: ఎస్‌.బి.ఉద్ధ‌వ్ 

డైలాగ్స్‌:  విక‌ర్ణ‌

స్క్రీన్ ప్లే:  కోటి బండారు, వేణుగోపాల్ రెడ్డి

ఆర్ట్‌: ర‌మేష్‌

పాట‌లు:  ఇమ్రాన్ శాస్త్రి, ప్ర‌ణ‌వ్ చాగంటి, అల‌రాజు

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com