దుబాయ్ లో భారీ లెవెల్ లో స్మగ్గ్లింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తి
- April 30, 2019దుబాయ్:దుబాయ్ ఎయిర్పోర్ట్ అధికారులు కంగుతిన్నారు. ఓ వ్యక్తి కడుపు నిండా 80 కండోమ్స్ బయటపడటంతో అవాక్కయ్యారు. తీరా చూస్తే అందులో డ్రగ్స్ నింపినట్లు వెల్లడైంది. ఈజిప్టుకు బయలుదేరేందుకు ఓ 49 ఏళ్ల వ్యక్తి దుబాయ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే అతడి కదలికలపై అనుమానం రావడంతో అక్కడి అధికారులు నిలువెత్తు స్కానింగ్ చేశారు. దాంతో కడుపులో ఏదో దాచినట్లు అనుమానం కలిగింది. నిలదీస్తే అలాంటిదేమీ లేదని బుకాయించాడు.
సదరు వ్యక్తి ఏదో దాస్తున్నాడని భావించి డాక్టర్ల పర్యవేక్షణలో తనిఖీలు చేశారు. అతడి కడుపులో 80 కండోమ్స్ చూసి షాక్ తిన్నారు. అయితే వాటి నిండా దాదాపు 2 కిలోల 300 గ్రాముల కొకైన్ నింపినట్లు నిందితుడు అంగీకరించాడు. దాంతో పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. లక్ష దిరములు అంటే దాదాపు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు శిక్షాకాలం పూర్తయిన తర్వాత దుబాయ్ నుంచి బహిష్కరించాలని తీర్పు చెప్పింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..