‘సైరా’ సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం
- May 03, 2019మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధిచిన సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్న అల్లు అరవింద్ ఫాంహౌస్‌లో ఈ సెట్ ఉంది. నిన్న రాత్రి సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చిత్ర యూనిట్ అప్రమత్తమై మంటలు ఆర్పేలోపే చాలా నష్టం వాటిల్లింది. ఫైరింజన్ కూడా వచ్చి మంటలు ఆర్పేసరికి.. సెట్లో చాలా భాగం కాలిపోయింది. ఈ ఘటనలో 2 కోట్ల రూపాయల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రమాదం కారణంగా మిగతా షూటింగ్‌కి ఏమైనా ఇబ్బంది ఉందా.. అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రొడ్యూసర్ రామ్‌చరణ్ కూడా ప్రమాదానికి గల కారణాలపై మీడియాతో మాట్లాడలేదు. దీంతో.. మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..