దుబాయ్‌లో 'స్ట్రీట్ డాన్సర్' చిత్రీకరణ
- May 04, 2019'ఏబీసీడీ 2' షో కో స్టార్స్ ఇప్పుడు డాన్స్ నేపథ్య చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ చిత్రమే 'స్ట్రీట్ డాన్సర్ 3డీ'. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్నారు. రిమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొత్త ఓ స్ట్రీట్ డాన్సర్ నృత్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చే విధంగా కథ ఉంటుందట. భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ దుబాయ్ లో మొదలు పెట్టారు. వరుణ్ ధావన్, శ్రద్ధాతో పాటు ఈ సినిమా యూనిట్ మొత్తం దుబాయ్‌లో వాలిపోయింది. అక్కడ డిఫరెంట్ డాన్స్ స్టయిల్స్‌పై కసరత్తు చేస్తున్నారు. వారం రోజులు క్రితం దీనిపై కసరత్తులు చేశారు. ఇప్పుడు అక్కడ 15 రోజులు పాటు షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, లిజెల్ డిసౌజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభుదేవా, నోరా పాతేహి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఏడాది నవంబర్ 8వ తేదీన విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?