అరటి పువ్వుతో స్త్రీపురుషులకి 6 ప్రయోజనాలు...
- May 10, 2019ప్రస్తుతకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఆ సమస్యలన్నింటికి మందులు వల్ల అప్పటికి తగ్గినా పూర్తిగా నయం అవ్వదు. అలాకాకుండా ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాల ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలని తగ్గించుకోచ్చు. అలాంటి వాటిల్లో అరటిపువ్వు ఒకటి. ఇది పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. ఇంకా దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
1. అరటిపువ్వు గుండె రూపంలో ఉంటుంది. కొంతమంది అరటిపువ్వును ఒక కూరగాయగా పరిగణిస్తారు. అంతేకాకుండా అరటిపువ్వును సలాడ్‌గా, సూప్‌లాగా తయారుచేసి వాడుతారు.
2. అరటిపువ్వుని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3. ఇందులోని ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ మీద ప్రభావం సక్రమంగా పనిచేసేటట్లు దోహదపడుతుంది.
4. వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల వీర్యవృద్దికి
దోహదపడుతుంది.
5. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేస్తుంది.
6. అరటిపువ్వు ఆడవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అరికట్టడానికి ఇది పనికొస్తుంది.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు