ఇమ్రాన్ హష్మీతో వినూత్న కథా చిత్రం చేస్తున్న బిగ్ బి
- May 10, 201970ఏళ్ళ వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న అమితాబ్ బచ్చన్ చివరిగా బద్లా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో ఆడియన్స్‌ని ఎంతగానో అలరించారు. తాజాగా మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బిగ్ బీ. బాలీవుడ్ కిస్సింగ్ వీరుడు ఇమ్మాన్ హష్మీతో కలిసి మిస్టరీ థ్రిల్లర్ చెహర్ అనే సినిమా చేయబోతున్నారు. ఈ రోజు నుండి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. కృతి కర్బంధ, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, రఘుబీర్ యాదవ్, దృత్మాన్ చక్రవర్తి, అన్ను కపూర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రుమి జఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆనంద్ పండింట్ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 21, 2020న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
తాజా వార్తలు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్