'రాక్షసుడు' టీజర్ విడుదల
- June 01, 2019బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి .. వాళ్లపై అత్యాచారం చేసి హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాలతో ఈ టీజర్ కొనసాగింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 18వ తేదీన విడుదల చేయనున్నారు. 'సీత' ఫలితంతో నిరాశ చెందిన బెల్లంకొండకి ఈ సినిమా ఊరట కలిగిస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..