బిగ్‌బాస్ నటికి బెయిల్..
- July 20, 2019నటి మీరామిథున్‌కు చెన్నై హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆమెకు హైకోర్టు నిబంధనలతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ రావడంతో బిగ్బాస్గేమ్షో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ బిగ్‌బాస్-3 కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుంటే ఆమె షో నుంచి బయటకు వచ్చేది.. దీంతో నిర్వాహుకులకు భారీ మెుత్తంలో నష్టం జరిగేది.
నటి మీరా మిథున్ అందాల పోటీల నిర్వాహణ కోసం తన వద్ద రూ.50 వేలు తీసుకుందని వాటిని తనకు తిరిగి ఇవ్వలేదని రంజిత్ బండారి అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని పిర్వాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలని నిర్ణయించారు. దీంతో మిథన్ ముందస్తు బెయిల్ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించింది.తాను బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో ఉన్నానని ఇప్పుడు పోలీసుల ముందు హాజరుకాలేనని చెప్పింది. హౌస్ నుంచి బయటకు రాగానే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని కోర్టుకు తెలిపింది. నటి మీరామిథున్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు షరతులతో కూడిన ముందుస్త బెయిల్‌ను మంజూరు చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?