అక్కడెవరున్నారు
- August 13, 2019నిజానికి, అక్కడ ఎవరూ లేరు
ఎవరో ఒకరున్నారన్న నమ్మకం తప్ప
అక్కడికి వచ్చీ పోయేవాళ్లు
ఒక్కొక్కరూ ఒక్కో పాట పాడతారు
అక్కడున్నంతసేపు
ఆకలీ దాహం తీరుతున్నట్లు
హాయిగా తల నిమిరి ఎవరో జోకొడుతున్నట్టు
ఆయువుకెవరో ఊపిరి పోస్తున్నట్టు
తీయటి కలగంటారు
నిజానికి, అక్కడ ఎవరూ లేరు
ఎవరో ఒకరున్నారన్న నమ్మకం తప్ప
మాట వినేవారు
మాట్లాడేవారు
అసలెవరూ లేరక్కడ
వాళ్ళ నమ్మకాన్ని వెంటబెట్టుకుని
వాళ్ళ చుట్టూ తిరుగుతున్న గాలి తప్ప
ఎప్పటినుండో వీస్తున్న గాలికి
అంతా తెలుసు , అక్కడేముందో !
వెర్రిగాలి ఏం చెప్పాలనుకుందో
గట్టిగా ఓ రాయి విసిరిందక్కడ
అలికిడయ్యిందో లేదో , అక్కడివారంతా
అలిగి మనోభావాలై నిలుచున్నారు !!
రోజుకింతా నమ్మకాన్ని సేవిస్తున్నా
వారిలో ద్వేషమేలా పెరిగిందో
గాలికి ఇంకా అర్థం కాలేదు
*పారువెల్ల*
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!