'ఇండియన్2' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
- August 16, 2019ప్రముఖ దర్శకుడు శంకర్ , విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు2 ఫస్ట్ లుక్ గురువారం ఉదయం విడుదలైంది. 20 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు రికార్డులు తిరగరాసింది. ఈ సినమాకు సీక్వేల్ గా భారతీయుడు2 వస్తోంది. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళం, తెలుగు, హిందీతో పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో తీయనున్నారు. భారతీయుడు2లో కమల్ హాసన్ కు జోడీగా ప్రముఖ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలో, నెగటివ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ సైతం ప్రముఖ పాత్రలో నటించనున్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. భారతీయుడులో పోషించిన సిబిఐ అధికారి పాత్రలోనే ఈ సినిమాలో కూడా నెడుమూడి వేణు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..