5 మందిని రక్షించిన భారత ప్రవాసిని సత్కరించిన దుబాయ్ పోలీసులు..!!

- March 17, 2025 , by Maagulf
5 మందిని రక్షించిన భారత ప్రవాసిని సత్కరించిన దుబాయ్ పోలీసులు..!!

యూఏఈ: గత సంవత్సరం ఏప్రిల్ వరదల సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, మునిగిపోతున్న SUV నుండి ఐదుగురిని రక్షించిన భారతదేశానికి చెందిన 28 ఏళ్ల ట్రైనీ ఆడిటర్ షావేజ్ ఖాన్‌ను దుబాయ్ పోలీసులు సత్కరించారు. పోలీసు పతకంతోపాటు 1,000 దిర్హామ్‌ల నగదు పురస్కారంను అందజేశారు.  సత్కరించారు. కమ్యూనిటీ హ్యాపీనెస్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ అలీ ఖల్ఫాన్ అల్ మన్సౌరి అతని ధైర్యసాహసాలకు గుర్తింపుగా సర్టిఫికెట్, పతకం, చెక్కును అందజేశారు.

ఆ సంఘటనను షావేజ్ ఖాన్‌ గుర్తుచేసుకున్నాడు. "నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఏమి చేస్తారో నేను అదే చేసాను. ఒక్క క్షణం ఆలోచించకుండా వారిని రిక్షించాను. దుబాయ్ పోలీసుల నుండి నాకు కాల్ వచ్చినప్పుడు, నేను షాక్ అయ్యాను. అక్కడ నిలబడి పతకాన్ని అందుకోవడం ఒక కలలా అనిపించింది. నేను ఈ విషయాన్ని మొదట నా తల్లిదండ్రులకు కాల్ చెప్పాను. వారు చాలా సంతోషించారు."అని " ఖాన్ తెలిపారు.

భారతదేశంలోని మీరట్‌లోని ఫలౌడా అనే చిన్న పట్టణం తన స్వస్థలం.  ఏప్రిల్ 16న, దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ఖాన్ అసర్ ప్రార్థనలు ముగించిన వెంటనే కోకా-కోలా అరీనా సమీపంలో వేగంగా పెరుగుతున్న నీటిలో చిక్కుకున్న పసుపు రంగు SUVని చూశాడు. ఏమాత్రం సంకోచించకుండా, అతను 20 అడుగుల లోతున నీటిలోకి దూకి, సమీపంలోని కార్మికుడు దాటిన సుత్తి సహాయంతో కారు గాజు పైకప్పును పగలగొట్టాడు. అందులోని ఐదుగురు ప్రయాణికులను సురక్షితంగా రక్షించాడు. అందులో ఇద్దరు అరబ్ పురుషులు, ఒక భారతీయ మహిళ, ఒక ఫిలిప్పీన్స్ వ్యక్తి, ఒక భారతీయ వ్యక్తి ఉన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com