మక్కాలో ఉమ్రా భద్రత పర్యవేక్షణకు 200 స్మార్ట్ స్క్రీన్లు ఏర్పాటు..!!
- March 17, 2025
మక్కా: మక్కాలోని కంట్రోల్ సెంటర్ రమదాన్ మాసంలో ఉమ్రా సీజన్లో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 200 కంటే ఎక్కువ స్మార్ట్ వాల్ స్క్రీన్లను ఉపయోగిస్తోంది. ఈ కేంద్రం మక్కాలోని 11 ప్రధాన ద్వారాలు, ఎనిమిది కంటే ఎక్కువ భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంది. ఏడు భద్రతా అంచెలుగా భద్రతా కార్యకలాపాలను విభజించి పర్యవేక్షిస్తున్నారు.
దాంతోపాటు నిఘా కార్యకలాపాలు మక్కాలోని అన్ని జిల్లాలు, పొరుగు ప్రాంతాలను కవర్ చేస్తాయని, మసీదు ప్రాంగణంలో భద్రతా చర్యలను సమన్వయం చేసే గ్రాండ్ మసీదులోని ఆపరేషన్స్ గదికి ప్రత్యక్ష డేటా ప్రసారం ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుందన్నారు.సజావుగా కమ్యూనికేషన్, వేగవంతమైన ప్రతిస్పందన కోసం గ్రాండ్ మసీదులోని భద్రతా కార్యకలాపాల కేంద్రం, యూనిఫైడ్ ఆపరేషన్స్ సెంటర్ 911 తో నేరుగా అనుసంధానించబడి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







