ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

- March 18, 2025 , by Maagulf
ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ ఇటీవల లండన్‌లో చారిత్రాత్మకంగా ‘వాలియెంట్’ సింఫనీ ప్రదర్శించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశం ఆహ్లాదకరంగా, స్ఫూర్తిదాయకంగా సాగిందని ఇళయరాజా వెల్లడించారు. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా సంగీత, సంస్కృతి, తాజా ప్రాజెక్టులు తదితర అంశాలపై ఇళయరాజా చర్చించారు. లండన్‌లో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి ప్రదర్శించిన ‘వాలియెంట్’ సింఫనీ గురించి ప్రధానిని అవగాహన చేయడం జరిగింది. ఇళయరాజా తన సంగీత ప్రయాణం, భారతీయ సంగీత ప్రభావం గురించి ప్రధానికి వివరించారు.

ప్రధాని మోదీ స్పందన
ఈ భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ, ఇళయరాజాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇళయరాజా ఒక సంగీత ఆణిముత్యం అని పేర్కొన్న మోదీ, భారతీయ సంగీతంలో ఆయన సృష్టించిన ప్రాముఖ్యతను వివరించారు. సంగీత ప్రపంచంలో మార్గదర్శకుడిగా నిలిచిన ఇళయరాజా, తన ప్రతిభతో సంగీత అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారని మోదీ కొనియాడారు.లండన్‌లో నిర్వహించిన వాలియెంట్ సింఫనీ, సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచే ఘట్టమని అభివర్ణించారు

ఇళయరాజా మొట్టమొదటిసారిగా లండన్‌లో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో సింఫనీ ప్రదర్శించారు. రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా వాద్య సహకారం అందించడం అపూర్వ ఘట్టంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు ఇది ఓ విశేష అనుభూతి.

భారతీయ సంగీతానికి విశ్వవ్యాప్త గుర్తింపు
భారతీయ సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో ఇళయరాజా పాత్ర అత్యంత కీలకం. లండన్‌లో సింఫనీ ప్రదర్శించడం ద్వారా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఇళయరాజా మ్యూజికల్ జర్నీ, భవిష్యత్తులో మరిన్ని సరికొత్త ఘన విజయాలకు దారితీసే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com