ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- October 12, 2025
కువైట్: కువైట్ కాపిటల్ గవర్నరేట్‌లోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7,658 నోటీసులు జారీ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 594 కేసులు ఓవర్టేక్, ఇతర వాహనాలను అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది.
ఇక రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 17 మందితోపాటు 11 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అన్ని గవర్నరేట్లలో ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లలలో ట్రాఫిక్ అవగాహనను పెంచాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకాన్ని నివారించాలని కోరింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







