అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- October 12, 2025
యూఏఈ: ఫుజైరాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ భాగం నుండి ఉపరితల అల్పపీడన వ్యవస్థ విస్తరించి ఉందని, ఎగువ స్థాయిలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా పలు సూచనలు చేసింది.
వర్షాలు కురిసే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోయలు మరియు నీరు ప్రవహించే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. మెరుపులు మరియు ఉరుముల వచ్చే సమయాల్లో బహిరంగ లేదా ఎత్తైన ప్రాంతాలలో ఉండవద్దని సూచించారు.
మరోవైపు, ఫుజైరాలో ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల్లో అద్భుతమైన వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. వీటిని చూసేందుకు నివాసితులు ఆసక్తి చూపుతున్నారు. వాటర్ ఫాల్స్ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







