ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!

- October 12, 2025 , by Maagulf
ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!

వాషింగ్టన్: ఇడాహోలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ బేస్‌లో F-15 ఫైటర్ జెట్‌లను ఉంచే ఎయిర్ బేస్ సౌకర్యాన్ని నిర్మించడానికి ఖతార్‌కు అనుమతి ఉంటుందని అమెరికా రక్షణ కార్యదర్శి  పీట్ హెగ్సేత్ ప్రకటించారు. దోహాలో హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తరువాత, దాడుల నుండి ఖతార్ ను రక్షించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన నేఫథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

ఇడాహోలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ బేస్‌లో ఖతార్ ఎయిర్ ఫోర్స్ సౌకర్యాన్ని నిర్మించడానికి మేము అంగీకార పత్రంపై సంతకం చేస్తున్నామని హెగ్సేత్ పెంటగాన్‌లో పేర్కొన్నారు. ఖతార్ డిప్యూపి పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి  షేక్ సౌద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థాని ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య సంధి కుదరడం, బంది-ఖైదీ మార్పిడి ఒప్పందానికి దారితీసిన చర్చలలో మధ్యవర్తిగా ఖతార్ "గణనీయమైన పాత్ర" పోషించినందుకు, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఒక అమెరికా పౌరుడిని విడుదల చేయడంలో సహాయం చేసినందుకు హెగ్సేత్ కృతజ్ఞతలు తెలిపారు.  ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ మధ్యప్రాచ్యంలో అమెరికా అతిపెద్ద సైనిక కేంద్రంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com