లండన్ విమానాశ్రయం మూసివేత
- March 21, 2025
లండన్: లండన్లోని హీథ్రో ఎయిర్పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మార్చి 22 వరకు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ విమానాశ్రయానికి కూడా ఈ సబ్స్టేషన్ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు హీత్రో ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితులు అనుకూలించడం లేదని పేర్కొన్నారు.
విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో.. సమీపంలోని ఇళ్లల్లో చీకట్లు అలముకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడడం వల్ల చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న 150 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. మంటలను ఆర్పడానికి 10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు