ఈ నెలాఖరులో 'బాబు బంగారం' ఆడియో వేడుక ..

- July 05, 2016 , by Maagulf
ఈ నెలాఖరులో  'బాబు బంగారం' ఆడియో వేడుక ..

విక్టరి వెంకటేశ్‌, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాబు బంగారం'. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది. జూలై 9న మూవీకి సంబంధించి సింగిల్ ట్రాక్ ని విడుదల చేయనున్న చిత్ర యూనిట్, ఈ నెలాఖరులో ఆడియో వేడుక జరపాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక కబాలి మూవీ రిలీజ్ ని బట్టి బాబు బంగారం చిత్ర రిలీజ్ ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఇక తాజాగా బాబు బంగారం చిత్రానికి సంబంధించి ఓ టీజర్ విడుదల చేశారు.ఏసీపీ కృష్ణగా వెంకటేష్ ఈ చిత్రం ద్వారా అలరించనున్నాడు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, జయప్రకాశ్‌, రఘుబాబు, బ్రహ్మాజి, సంపత్‌, మురళి శర్మ, వెన్నెల కిషోర్‌, మున్నావేణు, గిరిధర్‌, అనంత్‌, రాజా రవీంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com