2040 నాటికి టూరిజంలో 5 లక్షల ఉద్యోగాలు..!!
- March 25, 2025
మస్కట్: ఒమన్ పర్యాటక రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. 2040 నాటికి 500,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించి, మొత్తం OMR19 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలతో ఇది సాధ్యమవుతుందని హెరిటేజ్, పర్యాటక శాఖ మంత్రి సలీం మొహమ్మద్ అల్ మహ్రౌకి తెలిపారు. సోమవారం షురా కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు అల్ మహ్రౌకి.
ఈ సందర్భంగా పర్యాటక రంగ సమగ్ర వ్యూహాన్ని వివరించారు.2030 నాటికి దేశ GDPకి OMR3 బిలియన్లు లేదా 3.5 శాతం అందజేస్తుందని తెలిపారు. ఈ వృద్ధి ఒమన్ విజన్ 2040కు అనుగుణంగా దేశ భవిష్యత్తు అభివృద్ధికి మూలస్తంభంగా టూరిజం మారుతుందని పేర్కొన్నారు.
2019లో OMR1.8 బిలియన్ల నుండి 2023లో OMR2 బిలియన్లకు టూరిజం సెక్టర్ భాగస్వామ్యం పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. ఇది రాబోయే రోజుల్లో మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
దేశీయ పర్యాటకం గురించి మాట్లాడుతూ.. స్థానిక సందర్శకుల సంఖ్య 2019లో 10 మిలియన్ల నుండి 2023లో 13 మిలియన్లకు పెరిగిందన్నారు. దేశీయ పర్యాటక వ్యయం 2019లో OMR732 మిలియన్ల నుండి 2023లో OMR830 మిలియన్లకు పెరిగిందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!