సౌదీ అరేబియాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..హెచ్చరిక జారీ..!!
- March 25, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురువనున్నాయి. రాబోయే మూడు రోజులపాటు (ఈ శుక్రవారంవరకు) పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా , జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.
డైరెక్టరేట్ ప్రకారం.. మక్కా, అల్-బహా, అసిర్, జాజాన్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, నజ్రాన్ ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మదీనా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
మక్కా ప్రాంతంలోని తైఫ్, మైసాన్, అధమ్, అల్-అర్దియత్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మక్కా నగరం, అల్-జుముమ్, అల్-కామిల్, బహ్రాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అలాగే తూర్పు ప్రావిన్స్, రియాద్, నజ్రాన్, జజాన్, అసిర్, అల్-బహా, మక్కాలో వడగళ్ళు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!