స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా..

- March 25, 2025 , by Maagulf
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా..

హైదరాబాద్: ఐపీఎల్ 2025లో స‌న్‌రైజ‌ర్స్ దుమ్ములేపుతోంది. త‌న తొలి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై 44 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్‌ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ముఖ్యంగా ఇషాన్ కిష‌న్ శ‌త‌కం (106*)తో చెల‌రేగాడు.

అత‌డితో పాటు ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌(24), ట్రావిస్ హెడ్ (67), హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్‌కుమార్ రెడ్డి (30) లు దంచికొట్ట‌డంతో 286 ప‌రుగుల‌తో ఐపీఎల్‌లో రెండో అత్య‌ధిక స్కోరును స‌న్‌రైజ‌ర్స్ న‌మోదు చేసింది.

ఇక ఈ సీజ‌న్‌లో త‌న రెండో మ్యాచ్‌ను ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ ఆడ‌నుంది. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల విధ్వంసాన్ని మ‌రోసారి చూడాల‌ని ఫ్యాన్స్ ఆరాట ప‌డుతున్నారు. గురువారం (మార్చి 27) న ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలుస్తారు? రిష‌బ్ పంత్ టీమ్ హైద‌రాబాద్‌కు ఎంత వ‌ర‌కు పోటీ ఇస్తుంది అన్న సంగ‌తి కాస్త ప‌క్క‌న బెడితే.. ఓ హుషారైన వార్త ఇప్పుడు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ల‌క్నో, హైద‌రాబాద్ మ్యాచ్‌కు ముందు ఉప్ప‌ల్ మైదానంలో ల‌వ్‌లో త‌న సంగీతంతో అభిమానుల‌కు అల‌రించ‌నున్నాడు. సాయంత్రం 6.30 గంట‌లకు థ‌మ‌న్ ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని ఐపీఎల్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించండింది.

ఈ ట్వీట్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రీ ట్వీట్ చేసింది. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసేందుకు మైదానానికి రావాల‌ని కోరింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com