BAPS హిందూ మందిర్ కోసం అబుదాబి పోలీసుల గైడ్ లైన్స్..!!
- March 26, 2025
అబుదాబి: పండుగలు, సెలవు రోజుల్లో అబుదాభిలోని BAPS హిందూ మందిర్ ను సందర్శించే భక్తుల సంఖ్య అనుహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే పండుగలను పురస్కరించుకొని అబుదాబి పోలీసులు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో అందరూ గడపాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాది మంది సందర్శకులు భగవంతుడిని దర్శించుకోవాలని సూచించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో.. రద్దీ లాంటి సమస్యలను అధిగమించేందుకు ముందుగానే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆలయం ఉదయం 9 గంటలు గంటల నుంచి రాత్రి 8 గంటలు (రాత్రి 8 గంటల వరకు చివరి ప్రవేశం) వరకు తెరిచి ఉంటుంది. సందర్శకులు “మందిర్ అబుదాబి” యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవాలి: https://www.mandir.ae/visit
మీ నిర్ణీత సమయ స్లాట్ ప్రకారం మందిర్‌కు చేరుకోవాలని సూచించారు. మందిర్ క్యాంపస్‌లో మెరుగైన పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కాగా, సోమవారం మందిర్ మూసివేయబడుగుందని పేర్కొన్నారు. మరింత సమచారం కోసం https://www.mandir.ae/visit ను సందర్శించాలని కోరారు.
తాజా వార్తలు
- వెండింగే యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!