ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది?

- March 26, 2025 , by Maagulf
ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది?

న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR-U) దాఖలు చేసేందుకు లాస్ట్ డేట్ మార్చి 31, 2025. ఈ తేదీలోపు రిటర్న్ దాఖలు పన్నుచెల్లింపుదారులు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-2025) ముగిసే నాటికి టాక్స్ పేయర్లు ఆదాయ పన్నుకు సంబంధించి అన్ని చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మీరు ఇప్పటికే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? అయితే, ఫైలింగ్ చేసిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ రిఫండ్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫైలింగ్ తర్వాత రీఫండ్ ఎప్పటిలోగా వస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుందాం.

ఐటీఆర్ అంటే ఏంటి?
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది ఒక ఉద్యోగి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే పత్రం. ఇందులో ఒక వ్యక్తి ఆదాయం, చెల్లించాల్సిన పన్నులు ఉంటాయి. మీ ITR ఫారమ్‌లో అందించిన సమాచారం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com