బహ్రెయిన్ లో కొత్త స్కీమ్.. యువతకు BHD1,000 నెలవారీ బహుమతి..!!

- March 26, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో కొత్త స్కీమ్.. యువతకు BHD1,000 నెలవారీ బహుమతి..!!

మనామా: హిజ్ మెజెస్టి ది కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. బహ్రెయిన్ యువత కోసం నెలవారీ డ్రాను ప్రారంభించాలని ఆదేశించారు. 1,000 BHD నగదు బహుమతిని ప్రదానం చేయనున్నారు.ఈ స్కీమ్ బహ్రెయిన్ యువత దినోత్సవాన్ని పురస్కరించుకుని మొహుబ్బి అల్ అమల్ కంపెనీ నిర్వహించే ఎంప్లాయీ లాయల్టీ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద నిర్వహించనున్నారు.

సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ జనరల్, హోప్ ఫండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ అమాన్ బిన్ తౌఫిక్ అల్ మోయ్యద్.. ఈ చొరవ బహ్రెయిన్ యువత సానుకూల లక్షణాలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైలైట్ చేశారు. నెలవారీ డ్రా, నగదు బహుమతి మొహుబ్బీ అల్ అమల్ కంపెనీ ఎంప్లాయీ లాయల్టీ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న సంస్థలు, కంపెనీల ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రతి నెలా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బహ్రెయిన్ ఉద్యోగుల నుండి విజేతలను ఎంపిక చేస్తామని,  ఈ కార్యక్రమానికి అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com