ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్'

- March 26, 2025 , by Maagulf

నేచురల్ స్టార్ నాని ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్-రా స్టేట్‌మెంట్ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఈ గ్రిప్పింగ్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిధిని రీడిఫైన్ చేసింది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెకండ్ కొలాబరేషన్ ని సూచిస్తుంది.

మార్చి 26, 2026న సరిగ్గా 365 రోజుల్లో ది ప్యారడైజ్ తెరపైకి రానుంది. భారతీయ సినిమా ఈ మ్యాడ్నెస్‌ను చూడటానికి సరిగ్గా ఏడాది వుంది. కౌంట్‌డౌన్‌ను గుర్తుచేసుకోవడానికి, పేలుళ్లు, వార్ బ్యాక్ డ్రాప్ లో తుపాకీని పట్టుకుని వున్న పవర్ ఫుల్ కొత్త లుక్‌లో నానిని ప్రజెంట్ చేసే ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఇంటెన్స్ పోస్టర్  యాక్షన్-ప్యాక్డ్ జర్నీని సూచిస్తుంది.

హైదరాబాద్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సెట్ చేయబడిన ది ప్యారడైజ్ నానిని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయనుంది.

SLV సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, GK విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

ఈ చిత్రం ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com