తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ

- March 27, 2025 , by Maagulf
తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ

దుబాయ్: పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మార్చి 23, 2025 ఆదివారం రోజున.నిత్యావసర వస్తువుల కిట్లు (బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె, పండ్లు మరియు ఇతర వస్తువులు) పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. 
 
ఈసారి సేవాభావం మరియు మానవత్వం పాఠాలుగా సోనాపూర్ లేబర్ క్యాంప్ వద్ద 600కు పైగా ఉన్న కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ సేవా కార్యక్రమంలో ముఖ్యంగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అలాగే, ఆర్గనైజర్ భీమ్ శంకర్ బంగారి మరియు లాస్య నాగేష్ కీలక పాత్ర పోషించారు.ఈ సేవా కార్యక్రమం విజయవంతం అవ్వడం వెనుక కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. 

"ఈ సంవత్సరం, కేవలం ఆహారాన్ని పంపిణీ చేయడమే కాదు–రాబోయే తరాలకు సేవా భావాన్ని,మానవీయతను నేర్పించే లక్ష్యంతో ముందుకు వచ్చామని" తెలుగు అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ చేతులతో స్వయంగా కార్మికులకు కిట్లు అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలపడం ఈ కార్యక్రమంలో జరిగిన అత్యంత సంతృప్తినిచ్చిందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ(CDA) నుంచి ముఖ్యఅతిథిగా మహ్మద్ హమీద్ అల్ సీసీ మరియు అబ్దుల్లా యూసఫ్ అల్ మస్తరి హాజరై నిర్వాహకులను అభినందించారు.కార్మికులు ఈ సాయాన్ని ఎంతో కృతజ్ఞతతో స్వీకరించారు.ముఖ్యంగా పిల్లలతో ఆత్మీయ సంభాషణలు వారికి ఎంతో మానసిక ఆనందాన్ని అందించాయని తెలిపారు. భవిష్యత్తులో సైతం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరగాలని వాటికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని హమీద్ తెలిపారు. 

ప్రతి సంవత్సరం రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ రమదాన్ సాయాన్ని చేస్తున్న తెలుగు అసోసియేషన్ వారికి కార్మిక సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com