దుబాయ్ లో కొత్త రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు..!!

- April 01, 2025 , by Maagulf
దుబాయ్ లో కొత్త రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు..!!

యూఏఈ: దుబాయ్‌లో మంగళవారం బంగారం ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 22 కేరట్ల గోల్డ్ ప్రైస్ గ్రాముకు Dh350 కంటే ఎక్కువగా పలికింది. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ డేటా ప్రకారం.. గ్రాముకు Dh379 వద్ద (24 కేరట్లు) ప్రారంభమయ్యాయి. 22 కేరట్లు గ్రాముకు Dh350.75 వద్ద అమ్ముడయ్యాయి. ఇతర వేరియంట్లలో 21 కేరట్లు, 18 కేరట్లు వరుసగా గ్రాముకు Dh336.5, Dh288.25 వద్ద ప్రారంభమయ్యాయి.

2025 మొదటి మూడు నెలల్లో బంగారం గ్రాముకు దాదాపు Dh62 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా, బంగారం ఔన్సుకు $3,143.94 వద్ద ట్రేడవుతోంది. ఇది 0.83 శాతం పెరిగింది. ఇది 2025 మొదటి త్రైమాసికంలో దాదాపు 20 శాతంతో ముగిసింది.  xs.comలో మార్కెట్ విశ్లేషకుడు లిన్ ట్రాన్ మాట్లాడుతూ.. ఈ పెరుగుదలకు US ప్రభుత్వ టారిఫ్ చర్యలపై ఆందోళనలు, ప్రపంచ భౌగోళిక రాజకీయ అస్థిరత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు వంటివి కారణమని తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com