ట్రంప్ ఎపెక్ట్.. వాణిజ్య యుద్ధం, ద్రవ్యోల్బణం..యూఏఈ నిపుణుల ఆందోళన..!!

- April 04, 2025 , by Maagulf
ట్రంప్ ఎపెక్ట్.. వాణిజ్య యుద్ధం, ద్రవ్యోల్బణం..యూఏఈ నిపుణుల ఆందోళన..!!

యూఏఈ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఏఈపై 10 శాతం సుంకం విధించడంపై యూఏఈ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే, ట్రంప్ తాజా నిర్ణయం భారం వినియోగదారులు భరించాల్సి ఉంటుందని కొందరు చెబుతున్నారు.   

సాక్సో బ్యాంక్ MENA ట్రేడింగ్ , ప్రైసింగ్ హెడ్ హంజా డ్వీక్ ప్రకారం..ట్రంప్ నిర్ణయం GCC దేశాల ఆర్థిక వ్యవస్థలపై "బహుముఖ" ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థిక కోణంలో చూస్తే పెంచిన సుంకాలు GCC వ్యాపారాలకు ఎగుమతి ఖర్చులను పెంచుతాయని, అమెరికన్ మార్కెట్‌లో వారి పోటీతత్వాన్ని అడ్డుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు ఆయన అన్నారు.

"ఇది US మార్కెట్‌లపై ఆధారపడిన వ్యాపారాలకు ఎగుమతి వాల్యూమ్‌లు, ఆదాయాలు రెండింటిలోనూ తగ్గుదలకు దారితీయవచ్చు. ముఖ్యంగా అమెరికన్ డిమాండ్‌పై ఎక్కువగా ఆధారపడే రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది." అని పేర్కొన్నారు.  

కాగా,ట్రంప్ ఎఫెక్ట్  ప్రభావం తక్కువగా ఉంటుందని, కొత్త అవకాశాలను అందిస్తుందని సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విజయ్ ద్వీక్ అన్నారు. "US, GCC దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తక్కువగా ఉన్నందున, బేస్‌లైన్ సుంకాలు ఈ దేశాలపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపే అవకాశం లేదు" అని ఆయన అన్నారు.  అమెరికా అల్యూమినియం దిగుమతుల్లో GCC దేశాలు 16 శాతం వాటా కలిగి ఉన్నందున అల్యూమినియం పరిశ్రమ కొంత ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు. "బహ్రెయిన్, ఒమన్, ఖతార్ , సౌదీ అరేబియా అమెరికాకు అల్యూమినియం సరఫరా చేసే ప్రధాన దేశాలుగా ఉన్నాయి. కెనడా తర్వాత యూఏఈ రెండవ అతిపెద్ద సరఫరాదారుగా ఉంది." అని ఆయన అన్నారు.

"అయితే, ఈ ప్రాంతంలో ఇంధన ఖర్చులు తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, అమెరికా కొనుగోలు చేయని ఏదైనా అల్యూమినియంను స్థానిక నిర్మాణ ప్రాజెక్టులు, దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల వైపు మళ్లించవచ్చు. తద్వారా ఆర్థిక వైవిధ్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రయత్నాలను బలోపేతం చేయవచ్చు." అని వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com