న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌నోజ్‌కుమార్ క‌న్నుమూత‌..

- April 04, 2025 , by Maagulf
న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌నోజ్‌కుమార్ క‌న్నుమూత‌..

ముంబై: సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌నోజ్ కుమార్ క‌న్నుమూశారు.గ‌త‌ కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్ర‌వారం ఉద‌యం ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 87 సంవ‌త్స‌రాలు. ఆయ‌న మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. అభిమానులతో పాటు, ప‌లువురు ప్రముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

1937 జూలై 24న జన్మించిన మనోజ్ కుమార్ జ‌న్మించారు. ఆయ‌న అస‌లు పేరు హరికిషన్ గిరి గోస్వామి. 1957లో ఫ్యాష‌న్ మూవీతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. కాంచ్ కీ గుడియా చిత్రంతో గుర్తింపు పొందారు. అమరవీరుడు, బెనిఫిట్, తూర్పు మరియు పడమర, రోటీ కపడా ఔర్ మకాన్, విప్లవం వంటి చిత్రాలు ఆయ‌న‌కు మంచిపేరును తీసుకువ‌చ్చాయి.

దాదాపు 40 సంవ‌త్స‌రాల‌కు పైగా ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కు సేవలు అందించారు. ద‌ర్శ‌కుడిగా, రైట‌ర్‌గా, న‌టుడి ప్రేక్ష‌కుల్లో చెద‌ర‌ని ముద్ర వేశారు. ఆయన తెరపై అనేక పాత్రలకు ప్రాణం పోసినప్పటికీ, దేశభక్తి చిత్రాల ద్వారా ఆయన మరింత గుర్తింపు పొందారు. ఈ కారణంగా ఆయ‌న్ని భరత్ కుమార్ అని పిలిచేవారు.

త‌న కెరీర్‌లో మ‌నోజ్‌కుమార్ ఎన్నో పుర‌స్కారాల‌ను అందుకున్నారు. 1992లో ప‌ద్మ‌శ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల‌తో కేంద్రం ఆయ‌న్ను స‌త్క‌రించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com