కన్సల్టెంట్ కు BD7,000 పరిహారం..లేబర్ కోర్టు సంచలన తీర్పు..!!
- April 06, 2025
మనామా: ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి చట్టవిరుద్ధంగా తొలగించిన కన్సల్టెంట్‌కు దాదాపు BD7,000 వేతనాలు , పరిహారం చెల్లించాలని హై లేబర్ కోర్టు తీర్పు ఇచ్చింది. అతడు పనిచేస్తున్న ప్రాజెక్టులను అర్ధాంతరంగా రద్దు చేయడంతో నెలకు BD500 చొప్పున ఒప్పందం కింద పనిచేస్తున్న కన్సల్టెంట్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని బకాయిలకు సంబంధించి సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, కంపెనీ చెల్లింపు లేకుండా అతని ఉద్యోగాన్ని రద్దు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఆర్థిక ఇబ్బందులతో ప్రాజెక్ట్ రద్దు చేసినట్లు కంపెనీ వాదనను కోర్టు తిరస్కరించింది. ఆ సంస్థ వేతనం కింద BD2,000 చెల్లించాలని, సంవత్సరానికి ఆరు శాతం వడ్డీతో, ఆరు నెలల తర్వాత నెలకు ఒక శాతం చొప్పున, గరిష్టంగా పన్నెండు శాతం వరకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తప్పుడు తొలగింపుకు BD4,250, వార్షిక సెలవు బకాయిలకు BD226, సర్వీస్ ముగింపు గ్రాట్యుటీగా BD143, నోటీసుకు బదులుగా BD83 పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. అలాగే సంస్థ తిరిగి వచ్చేందుకు బాధితుడికి విమాన టికెట్ ను కూడా అందించాలి, ఉపాధి ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని ఆదేశించింది.
కాగా, సాక్షుల కథనం ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంపెనీ అనేక మంది ఇతర ఉద్యోగులను తొలగించిందని న్యాయమూర్తి అంగీకరించారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు యజమాని ఒప్పంద బాధ్యతలను నెరవేర్చకుండా మినహాయించవని కోర్టు స్పష్టం చేసింది
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!