కొత్త కార్ స్కామ్..సెలబ్రిటీల ప్రచారం..అధికారుల హెచ్చరిక..!!

- April 07, 2025 , by Maagulf
కొత్త కార్ స్కామ్..సెలబ్రిటీల ప్రచారం..అధికారుల హెచ్చరిక..!!

మనామా: బహ్రెయిన్‌లో కార్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మోసపూరిత పథకం గురించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్ & ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. మోసగాళ్ళు సెలబ్రిటీల వలె నటించి వ్యక్తులను మోసగించి, తప్పుడు సాకులతో కార్లను కొనుగోలు చేయమని మోసగిస్తున్నట్లు తెలిపింది. 

మోసగాళ్ళు బహ్రెయిన్ లో ప్రముఖులుగా నటిస్తూ బాధితులను నేరుగా సంప్రదిస్తారు.వారు పొరుగు దేశాల నుండి దిగుమతి చేసుకున్నట్లు వాహనాలు ఉన్నాయని నమ్మబలుకుతారు. వాటిని "ప్రత్యేక ఒప్పందం" లేదా వారి అనుమానిత కనెక్షన్ల ద్వారా సాధ్యమయ్యే "జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం"గా బిల్డప్ ఇస్తారు.

ఈ ఆఫర్లు పూర్తిగా నకిలీవని, మోసగించబడుతున్న వ్యక్తులకు స్కామర్లతో లేదా ఈ లావాదేవీలతో ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. మోసం ద్వారా కొనుగోలుదారుల నుండి డబ్బును దొంగిలించడమే లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు.

ముఖ్యమైన భద్రతా చిట్కాలు:

అధికారిక ధృవీకరణ లేకుండా ప్రముఖులు లేదా ప్రభావవంతమైన వ్యక్తులమని చెప్పుకునే వ్యక్తుల నుండి వచ్చే అవాంఛిత కాల్‌లను నమ్మవద్దు.

ఒప్పందం చట్టబద్ధతను పూర్తిగా నిర్ధారించే వరకు ఎప్పుడూ డబ్బును బదిలీ చేయవద్దు.

ఇటువంటి అనుమానాస్పద, అనధికారిక మార్గాల్లో నిర్వహించే ఏవైనా అమ్మకాలు స్కామ్‌లుగా మారే అవకాశం ఉంది.

సంబంధిత సంఘటనలను నివారించడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ హెచ్చరికను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని సూచించింది.

అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించండి:

హాట్‌లైన్: 992 (జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్ & ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com