'బాహుబలి' పైరసీ సీడీలు పట్టివేత
- July 12, 2015
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి సినిమా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లో చార్మినార్ సమీపంలో పోలీసులు సీడీ షాపులపై దాడులు చేశారు. 115 పైరసీ సీడీలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రభాస్,రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,సత్య రాజ్,నాజర్ తదితరులు నటించిన బాహుబలి శుక్రవారం విడుదలయిన సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది. పైరసీ భూతం అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయినా బాహుబలి విడులయిన రెండు రోజుల్లోనే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. పోలీసుల దాడులు చేసి పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







