Dh50,000 వివాహ గ్రాంట్‌..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!

- January 18, 2026 , by Maagulf
Dh50,000 వివాహ గ్రాంట్‌..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!

యూఏఈ: వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న యూఏఈ జాతీయులకు మద్దతుగా Dh50,000 గ్రాంట్‌ను దుబాయ్ బిలియనీర్ ఖలాఫ్ అల్ హబ్టూర్ ప్రకటించారు. రెండేళ్లలోపు బిడ్డను కన్న జంటకు ఈ ఆర్థిక సహాయం రెట్టింపు అవుతుందని అల్ హబ్టూర్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అయిన  ఖలాఫ్ అల్ హబ్టూర్ తెలిపారు.

వివాహం అనేది వ్యక్తిగత విషయం మాత్రమే కాదని, అవి సామాజిక మరియు జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.  ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న అల్ హబ్టూర్ గ్రూప్‌లో పనిచేస్తున్న ప్రతి ఎమిరాటీ యువకుడు లేదా యువతికి Dh50,000తో మద్దతు ఇస్తానని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పేర్కొన్నారు.

కుటుంబం స్థిరత్వానికి పునాది అని, పిల్లలు దేశ భవిష్యత్తుకు పెట్టుబడి అని తనకున్న ప్రగాఢ నమ్మకం నుండే ఈ చొరవ పుట్టిందని ఖలాఫ్ అల్ హబ్టూర్ అన్నారు. ఎమిరాటీ యువతను వివాహం చేసుకొని కుటుంబాలను ఏర్పరచుకునేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కూడా అల్ హబ్టూర్ పిలుపునిచ్చారు.

2025లో 11.5 మిలియన్లకు చేరిన యూఏఈ జనాభాలో ఎమిరాటీలు  దాదాపు 15 శాతం ఉన్నారు.  ఇక అల్ హబ్టూర్ గ్రూప్ వివిధ రకాల కంపెనీలలో యూఏఈ జాతీయులు మరియు ప్రవాసులతో సహా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com