నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- January 18, 2026
నిజ్వా: నిజ్వా విలాయత్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా అనేక షాపులకు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్‌కు చెందిన పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను కష్టపడి అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







