ఒమన్ లో 35వేల కంటే ఎక్కువ వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!

- April 09, 2025 , by Maagulf
ఒమన్ లో 35వేల కంటే ఎక్కువ వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!

మస్కట్: వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ.. గడువు ముగిసిన లేదా కార్యకలాపాలను నిలిపివేసిన 35,778 వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్‌ను సమీక్షిస్తున్నామని, అన్ని యాక్టివ్ వాణిజ్య రిజిస్టర్‌ సంస్థలు ఉనికిని నిర్ధారించే క్రమంలో తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.  

ఈ రెండవ దశ మార్కెట్ సమీక్ష.. గత రెండు దశాబ్దాలలో (2000 నుండి 2020 సంవత్సరాల వరకు) పనిచేయని లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  1970 - 1999 సంవత్సరాల్లో కార్యకలాపాలు నిలిపివేసిన లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన మార్కెట్ సమీక్ష మొదటి దశలో భాగంగా 3,415 వాణిజ్య రిజిస్టర్లను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com