ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

- April 10, 2025 , by Maagulf
ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

దోహా, ఖతార్: ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభ ఎడిషన్ అధికారికంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం సంప్రదాయం, ఆవిష్కరణలను అందించనుంది. దాంతోపాటు స్థానిక , ప్రాంతీయ ఫిషింగ్ బ్రాండ్‌లు, ఇంటరాక్టివ్ అనుభవాలు, ప్రత్యక్ష సముద్ర ప్రదర్శనలు, ఫిషింగ్ పోటీలను ప్రదర్శిస్తుందని ఓల్డ్ దోహా పోర్టు సీఈఓ ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు.  ఫిషింగ్ ఎగ్జిబిషన్‌లో 30 మందికి పైగా ఎగ్జిబిటర్లు , ఫిషింగ్‌లో ప్రత్యేకత కలిగిన 150 కి పైగా స్థానిక,  ప్రాంతీయ బ్రాండ్‌లు పాల్గొంటున్నాయని తెలిపారు.  

ఈ ప్రదర్శన ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఓల్డ్ దోహా ఓడరేవులోని మినా జిల్లాకు దక్షిణంగా ఉన్న మినా పార్క్‌లో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com